విద్యుత్ షాక్ కు గురై విజయవాడ ముంపు ప్రాంతంలో యువకుడు మృతి

560చూసినవారు
విద్యుత్ షాక్ కు గురై విజయవాడ ముంపు ప్రాంతంలో యువకుడు మృతి
విజయవాడ వరద ముంపు ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. భోజనం తెచ్చేందుకు బయటకు వెళ్లిన నాగబాబు అనే యువకుడు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. రోడ్డుపై నడుస్తూ విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబీకులు తెలిపారు. ఘటనా స్థలంలో నాగబాబుకి ఆర్ఎంపీ వైద్యుడు సీపీఆర్ చేసినా ప్రాణాలు నిలవలేదు. కానీ ఆ స్తంభానికి కరెంట్ లేదని, పక్కనున్న షాప్ లోని విద్యుత్ వల్ల షాక్ తగిలిందని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్