దుర్మార్గమైన పాలనలో చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి: సీఎం చంద్రబాబు

51చూసినవారు
దుర్మార్గమైన పాలనలో చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి: సీఎం చంద్రబాబు
బుడమేరు గండి పడిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘డ్రోన్ లైవ్ ద్వారా గండ్ల పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నాం. ఐదేళ్లలో బుడమేరు అనేక చోట్ల కబ్జాలకు గురైంది. దుర్మార్గమైన పాలనలో చేసిన తప్పుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీ చేశాం. ఎంత ప్రయత్నించినా శివారు ప్రాంతాలకు సరిగ్గా సాయం చేయలేకపోయాం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్