పురాతన విగ్రహాన్ని భారత్ కు ఇవ్వనున్న ఇంగ్లాండ్
![పురాతన విగ్రహాన్ని భారత్ కు ఇవ్వనున్న ఇంగ్లాండ్](https://media.getlokalapp.com/cache/e1/f5/e1f557127cc399df75b553cb1b02be34.webp)
సుమారు 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహాన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తిరిగి భారత్‌కు అప్పగించనుంది. ఈ విగ్రహం తమిళ కవి, స్వామీజీ తిరుమంగై ఆళ్వార్ కు చెందినది. తిరుమంగై ఆళ్వార్ విగ్రహాన్ని ఓ ఆలయం నుంచి దొంగిలించారని నాలుగేళ్ల క్రితం UKలోని భారత హైకమిషన్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఇంగ్లాండ్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.