జూన్‌లో తగ్గిన ఈవీ విక్రయాలు

80చూసినవారు
జూన్‌లో తగ్గిన ఈవీ విక్రయాలు
జూన్ నెలలో విద్యుత్‌ వాహనాల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మే నెలతో పోలిస్తే జూన్‌‌లో 14 శాతం తక్కువ విక్రయాలు నమోదయ్యాయి. ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో ఇప్పటివరకు 8,39,545 విద్యుత్‌ వాహనాలు (కార్లు, స్కూటర్లు) అమ్ముడయ్యాయి. మొత్తం వాహన విక్రయాల్లో ఈ సంఖ్య 6.69 శాతం కాగా.. ఈవీ విక్రయాల్లో టూవీలర్ల వాటా 57 శాతంగా ఉంది. విక్రయాలు చూస్తే.. మే నెలలో 1,23,704 వాహన విక్రయాలు నమోదుకాగా.. జూన్‌లో ఆ సంఖ్య 1,06,081కు తగ్గింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్