పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో ఆ టీమ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మీర్ పాక్ జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'పాక్ జట్టు ఎంపిక సరిగ్గా లేదు. ప్రస్తుతం ఉన్న జట్టుకు ధోనీ, యూనిస్ ఖాన్ లాంటి దిగ్గజ కెప్టెన్లను నియమించినా పరాజయాలే ఎదురవుతాయి. పాక్ సెమీస్ చేరకుండానే ఇంటికి దారి పడుతుందని నాకు ముందే తెలుసు' అని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.