నేను ఆఖరి 'రెడ్డి సీఎం'ను అయినా.. పర్వాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. "మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టేందుకు క్రమక్షశిణ కలిగిన సీఎంగా బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నా కోసం, నా పదవి కోసం కులగణన చేయలేదు. త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చాం. మా నాయకుడి ఆదర్శం కోసం నేను కార్యకర్తగా మిగిలేందుకు కూడా సిద్ధం" అని అన్నారు.