మహారాష్ట్ర ముర్తిజాపూర్ NCP మాజీ ఎమ్మెల్యే తుకారాం బిద్కర్ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాన్కులేను కలిసేందుకు తుకారాం ఎయిర్‌పోర్టుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఆయన బైక్‌ను ఒక గూడ్స్ వాహనం ఢీకొట్టింది. దీంతో బిద్కర్ తో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఆయన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంలో పనిచేస్తున్నారు.