గ్రహ శకలాలు ఒక నగరాన్ని నేల మట్టం చేయగలవు. ప్రస్తుతం ఇలాంటి వస్తువులను 11వేల వరకూ గుర్తించారు. కానీ చిన్న సైజులో భూ సమీప అంతరిక్ష రాళ్లు కోట్ల కొద్దీ ఉండే అవకాశముంది. ఇవి చిన్నవే అయినా మనకు ఆపద తెచ్చిపెట్టేవే. జనావాసాల్లో ఢీకొంటే పెద్ద అనర్థమే వాటిల్లుతుంది. 2024 పీటీ5 ఉనికితో భూమి చుట్టూ అంతరిక్ష రాళ్లకు సంబంధించి భారీ రహదారే ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఎక్కడున్నాయో? ఎలా ఉన్నాయో? ఎక్కడికి వెళ్తున్నాయో? తెలుసుకుంటే భూమిని కాపాడుకునే మార్గాలనూ అన్వేషించొచ్చు.