ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస ఓటములతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్లేయర్లపై మాజీ క్రికెటర్లు విమర్శలు కురిస్తున్నారు. తాజాగా వసీమ్ అక్రమ్ కూడా పాక్ టీంపై మండిపడ్డారు. భారత్‌తో మ్యాచ్ జరుగుతుండగా డ్రింక్ సమయంలో ప్లేటు నిండా అరటి పండ్లు తెచ్చి తినడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోతులు కూడా అంత తినవు అని తీవ్ర విమర్శలు చేశారు.