ఈవీఎం ధ్వంసం ఘటన.. అడుగడుగునా అధికారుల వైఫల్యం

1572చూసినవారు
ఈవీఎం ధ్వంసం ఘటన.. అడుగడుగునా అధికారుల వైఫల్యం
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్‌ను ధ్వంసం చేసిన ఘటనలో ప్రిసైడింగ్‌ అధికారి నుంచి సీఈవో దాకా అన్ని స్థాయిల్లోని అధికారులు విఫలం చెందారన్న వాదన వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే దుశ్చర్యల్ని ఏ స్థాయిలోనూ అధికారులు పరిశీలించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంలు ధ్వంసం చేసి, పౌరులపై వైసీపీ అనుచరులు దాడులు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశంతో చర్యలకు ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉపక్రమించారన్న వాదన వినిపిస్తోంది.

సంబంధిత పోస్ట్