పంజాబ్ మాజీ మంత్రి సుచా సింగ్ లంగా కొడుకు ప్రకాశ్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. అతనితో పాటు మరో నలుగుర్ని హిమాచల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఓ అమ్మాయి కూడా ఉంది. ఓ హోటల్‌లో ఉంటున్న వారిపై పోలీసులు రెయిడ్ చేశారు. మాజీ మంత్రి లంగా కుమారుడు డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. అరెస్టు అయిన వారి నుంచి 42 గ్రాములు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.