గుజరాత్ సమీపంలోని కచ్ తీరం, ఈశాన్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అల్ప పీడనం కాస్తా రాబోయే ఆరు గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని.. రెండు రోజుల్లో తీరం దాటనుందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వాతావరణ శాఖ సూచించింది.