పరీక్షల్లో ఫెయిల్.. మెడికో ఆత్మహత్య

72చూసినవారు
పరీక్షల్లో ఫెయిల్.. మెడికో ఆత్మహత్య
పరీక్షల్లో ఫెయిలైందని ఓ మెడికో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. HYD శివారు షాద్ నగర్ లోని రైతు కాలనీలో నివాసముంటున్న RMP వైద్యుడు బుచ్చిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఆయన కూతురు కీర్తి(24) ఫిజియోథెరపీ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. మరో కూతురు HYDలో చదువుతుండగా ఈరోజు తల్లిదండ్రులు ఆమెను చూసేందుకు వెళ్లారు. ఈ మేరకు ఇంట్లో ఎవరూ లేనిది చూసి కీర్తి ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్