నకిలీ డాక్టర్ గుండె ఆపరేషన్లు చేయడంతో ఏడుగురు పేషెంట్లు మరణించిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి దామోహ్ జిల్లాలోని క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల అతను పలు సర్జరీలు చేయగా ఒకే నెలలో ఏడుగురు పేషెంట్లు మరణించారు. ఈ నేపథ్యంలో అతనిపై అనుమానం వచ్చి ఆరా తీయగా నకిలీ డాక్టర్ అని తేలాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.