కమెడియన్ కునాల్ కమ్రాకు బుక్ మై షో సీఈవో ఆశిష్ షాక్ ఇచ్చారు. బుక్ మై షోలో కళాకారుల జాబితా నుంచి ఆయన పేరును తొలగించారు. ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కించపరుస్తూ పలు వీడియోలు చేశారు. ఈ క్రమంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే మద్రాస్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అరెస్టు నుంచి బయటపడ్డారు.