ప్రధాని మోదీకి శ్రీలంక ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ‘శ్రీలంక మిత్ర విభూషణ’ పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారంపై ప్రధాని స్పందించారు. దిసనాయకే, శ్రీలంక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని.. మిత్ర విభూషణ్ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నాను అని అన్నారు. భారత్- శ్రీలంక ప్రజల స్నేహానికి ఈ అవార్డు ప్రతీక అని మోదీ పేర్కొన్నారు.