భర్త చనిపోయారని తప్పుగా ప్రచారం: నటి ఆవేదన

63చూసినవారు
పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి భార్గవి ఓ యూట్యూబ్ ఛానల్ పై సీరియస్ అయ్యారు. తన కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త ఆర్మీ జవాన్ అని, జీవితంలో పడిన కష్టాలను చెబుతూ కన్నీరు పెట్టుకున్నట్లు తెలిపారు. అయితే దాన్ని ఆ యూట్యూబ్ ఛానల్ తన భర్త చనిపోయినట్లు ప్రచారం చేసిందని అన్నారు. సదరు ఛానల్ క్షమాపణలు చెప్పాలంటూ ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్