పేర్ల మార్పుపై రాజకీయ రగడ

68చూసినవారు
పేర్ల మార్పుపై రాజకీయ రగడ
ఏపీ, తెలంగాణలో పేర్ల మార్పుపై రాజకీయ రగడ నెలకొంది. ఇటీవల YSR జిల్లా పేరును YSR కడప జిల్లాగా, YSR తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్‌లో నిర్ణయించారు. తాజాగా డాక్టర్ YSR ఏసీఏ బిడిసీఏ క్రికెట్ స్టేడియం పేరులో YSR పేరును తీసివేశారు. దీనిపై వైసీపీ నిరసనలు తెలిపింది. అలాగే తెలంగాణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప‌రెడ్డి వర్సిటీగా మార్పునకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇదీ వివాదానికి దారితీసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్