ఐపీఎల్ 2025 భాగంగా సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ హాఫ్ సెంచరీ సాధించారు. కేవలం 26 బంతుల్లోనే సంజు 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. SRH బౌలర్లపై విరుచుకుపడుతూ సంజు, ధ్రువ్ జురేల్ విధ్వంసకర బ్యాటింగ్‌కు తెరలేపారు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన RR జట్టుకు వీరు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దీంతో 10 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 118/3గా ఉంది. క్రీజులో జురేల్ 46, సంజు 50 పరుగులతో ఉన్నారు.