SLBC సారంగ నిర్మాణం పనులు 10 ఏండ్లుగా నిలిచిపోయాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మళ్లీ ఈ పథకాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. వెంటనే పనులు చేపట్టాలని ముంబైకి చెందిన ఒక కంపెనీకి అప్పగించింది. సొరంగం లోపల 12వ కిలోమీటర్ల నుంచి లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. పైనుంచి ఉబికి వస్తున్న నీరు డ్రిల్లింగ్‌కు ఆటంకంగా మారింది. పరిస్థితి అంచనా వేయకుండా ముందుకు వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.