పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో నిరసన చేపట్టిన రైతులు ఈనెల 26న దేశవ్యాప్త ట్రాక్టర్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ సహా ఇతర డిమాండ్ల సాధనకు రైతులంతా మార్చ్‌లో పాల్గొనాలని కోరారు. కాగా రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ సరిహద్దులో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కేంద్రం దిగొచ్చేవరకు దీక్ష విరమించబోనని తేల్చి చెప్పారు. ఆయనకు మద్దతుగా వేలాదిమంది రైతులు ఆందోళన చేస్తున్నారు.