పుట్టినరోజు వేడుకకు వెళ్తుండగా ఘోర ప్రమాదం (వీడియో)

77చూసినవారు
AP: శ్రీకాకుళం జిల్లా లావేరులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మధురవాడకు చెందిన లక్ష్మీపతి అన్న కొడుకు పుట్టిన రోజు ఆదివారం ఉండటంతో తల్లి మీనమ్మ, భాస్కరరావుతో కలిసి కారులో విశాఖకు బయలుదేరారు. బుడుమూరు హైవేపై కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్ష్మీపతి కుటుంబం, స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. దాంతో లక్ష్మీపతి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్