ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి

65చూసినవారు
ఘోర విమాన ప్రమాదం.. 179 మంది మృతి
సౌత్ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది మృతి చెందినట్లు యాంహాప్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. ప్రమాద సమయంలో మొత్తం 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది విమానంలో ఉన్నారని తెలిపింది. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయిందని అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణం ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో ముయాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్