ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి

76చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి
AP: తిరుపతి జిల్లా రేణిగుంట (M) గాజులమండ్యంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆక్కడి యోగానంద కళాశాల సమీపంలో ఓ లారీ డివైడర్ల మధ్యలో రోడ్డు పనులు చేస్తున్న వారిని ఢీకొని డివైడర్ దాటి అవతలి రోడ్డులోకి దూసుకు వెళ్ళింది. ప్రమాద ఘటన స్థలంలో రమణమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరుపాల్ అనే కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్