తెలంగాణలో మహిళలతో మహిళా దినోత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. HYD పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క ఆధ్యక్షతన జరగనున్న సభా వేదికగా లక్ష మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్-2025ను సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. ఈ సభకు జిల్లాల నుంచి వచ్చే మహిళల కోసం 600కు పైగా ఆర్టీసీ బస్సులను సెర్ప్ అందుబాటులో ఉంచింది.