AP: ఉచిత బస్సు ప్రయాణం పథకంపై YCP విమర్శలకు స్థ్రాంగ్ కౌంటర్ ఇస్తూ CM చంద్రబాబు గతంలో మాట్లాడిన వీడియోను TDP ట్వీట్ చేసింది. 'ఒక జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం అని TDP అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. జనానికి మేలు జరిగితే ఓర్వలేని జగన్ ఉచిత బస్సు ప్రయాణంపై విషం కక్కుతున్నాడు' అని 'X'లో పోస్ట్ చేసింది.