పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి మలబద్ధకాన్ని అదుపులోకి తెస్తాయి. అయితే కొన్ని పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పెరుగు తిన్న తర్వాత నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లను తినకూడదు. ఇది జీర్ణవ్యవస్థను మరింత దిగజార్చుతుందని నిపుణులు చెబుతున్నారు.