AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు పౌరుషం చచ్చిపోయిందా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్యామల మీడియా సమావేశం నిర్వహించారు. శ్యామల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. శ్యామల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత జగన్‌కు దక్కుతుందన్నారు.