పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) బాంబు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పాక్ సైనికులు బస్సులో క్వెట్టా నుంచి తఫ్తాన్ వెళ్తుండగా దాడి చేయడంతో దాదాపు 7 మంది మరణించగా 23 మంది గాయపడ్డారు. పాక్, బలూచ్ వేర్పాటువాదుల మధ్య పోరు తీవ్రంగా మారడంతో పాక్ ఇప్పటికే భారీగా నష్టపోయింది.