కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడన ఘటనలో ఐదో రోజు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు ప్రధానంగా దృష్టిపెట్టాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి మనుషుల జాడను గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 344కు చేరుకుంది. ఇందులో 146 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారలు తెలిపారు. మృతుల సంఖ్య పెరగనున్నట్లు సమాచారం.