వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా సీటు కోసం ఓ యువకుడు, యువతి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువకుడు, యువతి పోట్లాడుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. పక్కనే ఖాళీ ఉన్నప్పటికీ ఆ యువతి మరీ పొగరుగా ప్రవర్తించింది. యువకుడిని చెప్పుతో కొట్టేందుకు కూడా ప్రయత్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు ఆమె చెంప చెల్లుమనిపించాడు.