'తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీకి పునాది వేసిన వారిలో నేను ఒకడిని' అని ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వ్యాఖ్యలను, మంత్రి సీతక్క ఖండించారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. BRS చేయలేనిది మేం చేశామని, అభినందించాల్సింది పోయి విమర్శలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణనపై అభ్యంతరాలుంటే మండలిలో మాట్లాడొచ్చని.. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని సీతక్క స్పష్టం చేశారు.