ఐకానిక్ శివాలయంలో అగ్ని ప్రమాదం

65చూసినవారు
ఐకానిక్ శివాలయంలో అగ్ని ప్రమాదం
జమ్మూ కాశ్మీర్లోని గుల్‌మార్గ్‌ పట్టణంలో గల మహారాణి ఆలయం అని పిలువబడే ఐకానిక్ శివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎక్కువగా చెక్కతో నిర్మించిన ఆలయం కావడంతో పూర్తిగా దెబ్బతింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదని అధికారులు తెలిపారు. 1980ల ప్రారంభంలో ఈ ఆలయం బాలీవుడ్ సినిమాల చిత్రీకరణలో వినియోగించేవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్