భారత్ వెలుపల తొలి ఐఐటీ క్యాంపస్ టాంజానియాలోని జంజిబర్ లో రానుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయని పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్, జంజిబర్ అధ్యక్షుడు హుస్సేని అలి మియి సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు తెలిపింది. కాగా, మంత్రి జైశంకర్ ప్రస్తుతం టాంజానియా పర్యటనలో ఉన్నారు.