రైలుకు నిప్పు.. ఐదుగురి మృతి (Video)

73చూసినవారు
బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు శుక్రవారం ఘోరం జరిగింది. ఢాకాలోని గోలప్‌బాగ్‌లో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 4 బోగీలు తగలబడగా.. ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. రైలులో భారత ప్రయాణికులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా.. ప్రతిపక్ష బీఎన్పీయే ఈ కుట్రకు పాల్పడిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది.

ట్యాగ్స్ :