సరిహద్దు వద్ద నేపాలీల దుశ్చర్య

74చూసినవారు
సరిహద్దు వద్ద నేపాలీల దుశ్చర్య
ఉత్తరప్రదేశ్‌లోని మూడు ఫారెస్ట్ చెక్ పోస్టులకు 25 మంది నేపాలీలు నిప్పంటించారు. కతర్నియాఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గతేడాది నవంబర్‌లో కొందరు నేపాలీలు సరిహద్దులోని ఈ ఫారెస్టులో చెట్లను అక్రమంగా నరికివేశారు. దీంతో పదిమంది నేపాలీలపై కేసు నమోదైంది. కాగా శుక్రవారం రాత్రి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, చెట్ల నరికివేత కేసుతో సంబంధం లేదని అతడ్ని వదిలిపెట్టారు. ఈ ఘటనతో నేపాలీలు ఆగ్రహం వ్యక్తం చేసి ఔట్ పోస్టులకు నిప్పంటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్