TG: సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ లో ఏడుగురు ఈతకు దిగగా.. ఐదుగురు యువకులు మృతి చెందారు. అయితే ప్రమాదానికి ముందు బాధిత యువకులు నీటిలో దిగి కేరింతలు కొడుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మృతులను హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ధనుష్(20), లోహిత్(17), దినేశ్వర్(17), సాహిల్(19), జతిన్(17) లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.