TG: అకాల వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తింది. దీని కారణంగా ఇవాళ భీమలింగం వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో వలిగొండ మండలంలోని సంగెం, భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.