పెట్రోలియంపై విండ్‌ఫాల్ ట్యాక్స్ మరోసారి తగ్గింపు

70చూసినవారు
పెట్రోలియంపై విండ్‌ఫాల్ ట్యాక్స్ మరోసారి తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చమురుపై విండ్ ఫాల్ టాక్స్ ను తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అంతకు ముందు వరుసగా పెంచుకుంటూ పోయిన ఈ టాక్స్ ను.. తాజాగా తగ్గిస్తూ వస్తోంది కేంద్రం. అది కూడా ఎన్నికల సమయంలోనే కావడం గమనార్హం. ముడి చమురుపై విండ్ ఫాల్ టాక్స్ ను రూ. 500 తగ్గించింది. దాంతో ప్రస్తుతం మెట్రిక్ టన్నుకు రూ. 5200 కు చేర్చింది. తగ్గించకముందు ఇది రూ. 5700గా ఉంది. జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్