AP: పెద్ద నగరాలకే పరిమితమైన 'కొకైన్' మొదటిసారి గుంటూరులో దొరకడం కలకలం రేపింది. ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు యువకుల నుంచి 8.5గ్రా. కొకైన్ ను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోనే ఇది తొలి కొకైన్ కేసు అని తెలిపారు. ఒక్కో గ్రాము కొకైన్ ను రూ.3K-రూ.6Kకు అమ్ముతున్నట్లు సమాచారం. మాదక ద్రవ్యాల రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు చెప్పాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.