ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో అక్రమాలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ ఆప్ నేతకు సత్వర విచారణకు హక్కు లేకుండా పోయిందని సుప్రీం పేర్కొంది. సిసోడియాకు ఇంతకు ముందు పెరోల్‌పై ఒకసారి, కోర్టు అనుమతితో మరోసారి జైలు నుంచి బయటకొచ్చారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.