హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో అధికారులకు మళ్లీ ఈడీ పిలుపునిచ్చింది. ఈ నెల 8, 9వ తేదీల్లో విచారణకు హాజరు కావాలని బీఎల్‌ఎన్ రెడ్డి, అరవింద్‌కుమార్‌లకు నోటీసులు ఇచ్చింది. ఈ రోజు హాజరుకాకుండా రెండు నుంచి 3 వారాలపాటు సమయం కావాలని అధికారులు కోరారు. దీంతో ఈ నెల 8,9 తేదీల్లో తప్పకుండా హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.