బస్సు బీభత్సం.. నలుగురు మృతి

81చూసినవారు
బస్సు బీభత్సం.. నలుగురు మృతి
గోవాలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న గుడిసెల్లోకి బస్సు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి దక్షిణ గోవాలోని వెర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్