ఎఫ్‌పీఐల పెట్టుబడులు పుంజుకున్నాయి. భారత్ మార్కెట్‌పై గణనీయమైన అంచనాల నేపథ్యంలో సెప్టెంబర్‌లో రూ.57,724 కోట్ల నిధుల్ని మార్కెట్లోకి తీసుకొచ్చాయి. తర్వాత అంతర్జాతీయ ప్రతికూల అంశాల కారణంగా క్రమంగా విక్రయాలు మొదలుపెట్టాయి. నవంబర్‌లో నికరంగా రూ.21,612 కోట్లు వెనక్కి తీసుకున్నాయి. ఇక డిసెంబర్‌లో కేవలం రెండు వారాల్లోనే రూ.22,766 కోట్లను మార్కెట్లోకి చొప్పించాయి. ఇది దేశీయ ఆర్థిక అవకాశాలపై పెరుగుతున్న విశ్వాసాన్ని చూపుతోంది.