శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకు గాను యాత్రికుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని పేర్కొంది. వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది. దీంతో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనుంది.