AP: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 17 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి పలు సూచనలు చేసింది. టెన్త్ విద్యార్థులకు బస్ పాస్ లేకపోయినా హల్ టికెట్లు చూసి పల్లె వెలుగు లేదా అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ హాలిడే రోజుల్లో కూడా ఎగ్జామ్ ఉంటే కూడా అనుమతించాలని పేర్కొంది.