ఛాంపియన్స్‌ ట్రోఫీ.. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్‌ రద్దు

73చూసినవారు
ఛాంపియన్స్‌ ట్రోఫీ.. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్‌ రద్దు
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండి వేదికగా మంగళవారం జరగాల్సిన సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మ్యాచ్‌ రద్దయింది. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న రావల్పిండి స్టేడియంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్ రద్దవ్వడంతో సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో గ్రూప్-బి నుంచి సెమీస్‌ చేరనున్న జట్లపై ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత పోస్ట్