అయిజ మండల పరిధిలోని బింగీదొడ్డి గ్రామంలో బీజేపీ నమోదు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజలకు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉచిత వైద్యం, 18 రకాల కులవృత్తులకు విశ్వకర్మ యోజన పథకం అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అందరిలో విశ్వాసాన్ని కలిగించిందని పేర్కొన్నారు.