గద్వాల జిల్లా కేంద్రంలోని కే. ఎస్. ఫంక్షన్ హాల్లో జరిగిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 2025 డైరీ ఆవిష్కరణ మహోత్సవంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఎమ్మెల్యే యూనియన్ 2025 డైరీని ఆవిష్కరణ చేశారు.