గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల 8 నెలల పెండింగ్ వేతనాలను ఇవ్వాలని, శనివారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ కార్మిక సంఘం తెలిపింది. ఐఎఫ్టీయూ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి జమ్మిచెడ్ కార్తీక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ (ఐఎఫ్టీయూ) అనుబంధం జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1,000 మంది కార్మికుల పెండింగ్ వేతనాలను ఇవ్వాలని శుక్రవారం డిమాండ్ చేశారు.